TRS Deeksha: ధాన్యం కొనుగోళ్ల సమస్యపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు తెరాస సిద్ధమవుతోంది. రేపు దిల్లీలోని తెలంగాణభవన్ వేదికగా మహాధర్నా చేపట్టనుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్నాలో మంత్రులు, ఎంపీలు సహా పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. దీక్షకు ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పరిశీలించారు.
దిల్లీలో జరిగే నిరసనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌తో పాటు ఎంపీలు, మంత్రులు సహా పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. దేశ రైతులకు మద్దతుగా గొంతెత్తేనేతలంటూ కేసీఆర్, కేటీఆర్ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మూడు రోజుల నుంచి: నాలుగో తారీఖున మొదలైన తెరాస నిరసనల పరంపర.. కొనసాగుతోంది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దళం ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా.. ర్యాలీలు, నల్లజెండాలతో తెరాస నిరసన తెలిపింది. ఈ నిరసనల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు.
ఇదీ చూడండి: