ETV Bharat / state

రేపు మినీ పురపోరుకు పక్కాగా ఏర్పాట్లు..! - mini-municipal elections latest update

కొవిడ్ కల్లోలంలోనే రేపు మినీ పురపోరుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్, ఖమ్మం నగరపాలికలతో పాటు మరో ఐదు పురపాలికలు సహా ఐదుచోట్ల ఉపఎన్నికలు జరగనున్నాయి. వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న వేళ కొవిడ్‌ నిబంధనలు పాటించి పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపు మినీ పురపోరు
రేపు మినీ పురపోరు
author img

By

Published : Apr 29, 2021, 3:40 AM IST

రాష్ట్రంలో మినీ పురపోరుకు అంతా సిద్ధమైంది. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలు, సిద్దిపేట, జ‌డ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌, అచ్చంపేట పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు జీహెచ్​ఎంసీలో​ని ఒక డివిజన్, మరో నాలుగు పురపాలికల్లోని నాలుగు వార్డులకు పోలింగ్‌ జరగనుంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 66 డివిజన్లలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పరిధిలో 6 లక్షల 53 వేల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎన్ఐటీలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

సిద్దిపేటలో జిల్లా అదనపు కలెక్టర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మాస్కు లేనివారికి పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. ఆశా వర్కర్‌లు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు శానిటైజర్ చేస్తారని పేర్కొన్నారు. మినీ పోరు కోసం మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రంగం సిద్ధమైంది. సిబ్బందికి కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, ఫేస్‌షీల్డ్‌లు పంపిణీ చేయనున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

పోలింగ్ రోజున ఓటర్లు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా వలయాలు గీసి ఉంచారు. అలంపూర్ మున్సిపాలిటీలో 5వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నామపత్రం దాఖలు చేసిన ఏకైక అభ్యర్థి ఎరుకలి లక్ష్మీదేవమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మరింత జాగ్రత్త అవసరం..

కరోనా ఉద్ధృతి వేళ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా.. ఆ నియోజకవర్గంలో నోటిఫికేషన్‌కు ముందు 25 నుంచి 30 కేసులు నమోదు కాగా.. ఎన్నికల ప్రచారం చివరి రోజున అవి 266 అయ్యాయి. ప్రచారం నిర్వహించిన సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత ప్రారంభమైన మినీ పురపోరులోనూ ఈ వాతావరణమే ఉంది. ఈ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల ఓటర్లు, ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. స్థానిక ఎన్నికలు కావడంతో పెద్దఎత్తున పోలింగు జరిగే వీలుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చూపితే మళ్లీ కేసులు పెద్దసంఖ్యలో పెరిగే ప్రమాదం ఉంది.

ఇదీ చూడండి: లాక్​డౌన్​పై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవం: డా.శ్రీనివాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.