ETV Bharat / state

తెలంగాణ ఈసెట్​-2020 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి - ts news

తెలంగాణ ఈసెట్​-2020 పరీక్షను ఈ నెల 31న ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఆన్​లైన్​ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలను జేఎన్​టీయూ విడుదల చేసింది.

Arrangements are complete for conducting Telangana ECET-2020 exam
తెలంగాణ ఈసెట్​-2020 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Aug 27, 2020, 8:50 PM IST

తెలంగాణ ఈసెట్-2020 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు పరీక్షకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను జేఎన్టీయూహెచ్​​ విడుదల చేసింది. ఈనెల 31న ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఆన్​లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలంగాణలో 52, ఆంధ్రప్రదేశ్​లో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఈ పరీక్షకు రాష్ట్రంలో 28,040 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 24,227 మంది హాల్ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకున్నారు. పరీక్షకు అభ్యర్థులు మాస్కులు ధరించి శానిటైజర్ తీసుకొని రావాలని, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసెట్ నిబంధనలు వర్తిస్తాయని జేఎన్​టీయూ రిజిస్ట్రార్​, టీఎస్ ఈసెట్ కన్వీనర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు.

Arrangements are complete for conducting Telangana ECET-2020 exam
తెలంగాణ ఈసెట్​-2020 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఇవీ చూడండి: జేఈఈ, నీట్​ పరీక్షలను వాయిదా వేయాలి: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.