రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలే ప్రాధాన్యమని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే.. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా విమర్శల తీరును జీవన్ రెడ్డి ఖండించారు. రైతులను ఎంపీ అర్వింద్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అర్వింద్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేటీఆర్ మాట్లాడినందుకు ఆయనను దూషిస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా ప్రభుత్వంలో అన్నీ అమ్మేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ ప్రజలు అర్వింద్‌ను తరిమికొడతారని.. తెలంగాణ కోసమే కేసీఆర్ కుటుంబం జన్మించిందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగం