ETV Bharat / state

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్​ న్యూస్​.. దర్శన టికెట్లు ఏపీఎస్​ ఆర్టీసీ బస్సుల్లోనే - శ్రీశైలం యాత్రికులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

APSRTC SPECIAL PACKAGE: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు బస్సుల్లోనే శ్రీవారి శీఘ్ర దర్శనం టికెట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా శ్రీశైలం వెళ్లే భక్తులకూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కాగా ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.

AP good news for devotees going to Srisailam
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ గుడ్​ న్యూస్
author img

By

Published : Feb 7, 2023, 8:19 PM IST

APSRTC SPECIAL PACKAGE: ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు బస్సుల్లోనే శ్రీవారి శీఘ్ర దర్శనం టికెట్లు ఇస్తోన్న విధానాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఇతర పుణ్య క్షేత్రాలకూ విస్తరించింది. ఇకపై శ్రీశైలం వెళ్లే భక్తులకూ ఈ తరహా విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 9 నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.

ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లికార్జున స్వామి భ్రమరాంబికా అమ్మవార్ల స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి టికెట్లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ప్రతి రోజూ 1075 దర్శన టికెట్లు కేటాయించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్లతో పాటు దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.

ప్రయాణానికి 15 రోజులు ముందుగానే దర్శనం టికెట్లు జారీ చేస్తామని, ఏపీఎస్ ఆర్టీసీ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు వివరించారు. దేవాదాయశాఖ సమన్వయంతో ఆర్టీసీ ప్రయాణికులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.