ETV Bharat / state

Sajjala OSD: సజ్జల ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖాధికారి - సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీ

తెలంగాణ జైళ్లశాఖలో పనిచేసే వ్యక్తిని అంతర్‌ రాష్ట్ర డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకొచ్చి బాధ్యతలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా నియమించారు. ప్రస్తుతం అతని నియామకం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.

sajjala ramakrishna reddy
సజ్జల ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖాధికారి
author img

By

Published : Jul 16, 2021, 9:39 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా... తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి.దశరథ రామిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అంతర్‌రాష్ట్ర డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకొచ్చి మరీ ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించింది. సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా డిప్యుటేషన్‌పై తనను నియమించాలంటూ జనవరి 20వ తేదీన దశరథ రామిరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అందుకు సమ్మతి తెలపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 11న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వినతికి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా రెండేళ్ల పాటు అంతర్‌రాష్ట్ర డిప్యుటేషన్‌కు సమ్మతిస్తూ ఈ నెల 3వ తేదీన ఆ సమాచారాన్ని ఏపీకి తెలియజేసింది.

ఈ నేపథ్యంలో ఆయనను సజ్జలకు ఓఎస్డీగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు గురువారం ఉత్తర్వులిచ్చారు. వెంటనే రిలీవ్‌ చేసి.. చివరి వేతన చెల్లింపు ధ్రువపత్రం (ఎల్‌పీసీ)తో పాటు సర్వీసు రిజిస్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌ సాధారణ పరిపాలన శాఖలో సమర్పించాలంటూ తెలంగాణ హోంశాఖను ఉత్తర్వుల్లో కోరారు. ప్రస్తుతం దశరథరామిరెడ్డి నియామకం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి. 'కరోనా మూలాల నిర్ధరణకు చైనా సహకరించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.