Apollo telehealth: టెలీ హెల్త్ సేవల్లో అపోలో పయనీర్‌గా ఎదుగుతోందని ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. టెలీ హెల్త్ సేవల్లో అపోలో ప్రమాణాలు, నాణ్యతకు గుర్తింపుగా బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్ స్టిట్యూట్ అందించే ఐఎస్ఓ సర్టిఫికేట్‌ను పొందినట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో బీఎస్ఐ డైరక్టర్ పంకజ్ చేతులమీదుగా ప్రతాప్ రెడ్డి సర్టిఫికేట్‌ను అందుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచ ఆరోగ్య రంగంలో ఈ రకమైన గుర్తింపు సాధించిన మొదటి ఆసుపత్రిగా అపోలో ఆస్పత్రి రికార్డు నెలకొల్పిందని ప్రతాప్ సి రెడ్డి పేర్కొన్నారు.
రోజుకు 24 వేలకు పైగా టెలీ కన్సల్టెన్సీ సేవలను అపోలో ఆస్పత్రులు అందిస్తున్నాయని అపోలో గ్రూపు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అన్నారు. నాణ్యమైన టెలీ కన్సల్టెన్సీ సేవలకు గుర్తింపు రావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: MLC Elections Polling: ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్