ETV Bharat / state

HCA:హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అసలేం జరుగుతోంది..?

author img

By

Published : Jun 17, 2021, 8:29 PM IST

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. యువ క్రికెటర్లను తయారు చేయాల్సిన హెచ్​సీఏ.. దశాబ్దాలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్​పై అపెక్స్‌ కౌన్సిల్‌ అనర్హత వేటు వేసింది. క్రికెట్‌ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదని అజారుద్దీన్‌ చెబుతుండగా.. ఆయన అధ్యక్షుడే కాదని అపెక్స్‌ కౌన్సిల్‌ పేర్కొంది.

HCA:హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో తారాస్థాయికి కుమ్ములాటలు..!

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నియమ, నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడు అజారుద్దీన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. అపెక్స్‌ కౌన్సిల్‌ హెచ్​సీఏ సభ్యత్వాన్ని రద్దు చేసింది. లోధా సిఫార్సుల మేరకే నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. అపెక్స్ కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారని.. అందులో ఆరుగురు మాత్రమే ఎన్నిక కాబడ్డారని తెలిపింది. మిగతా ముగ్గురిలో ఒకరు మహిళ, మరొకరు పురుషుల క్రీడాకారుల తరఫున, ఇంకొకరు ఆడిటింగ్‌ నుంచి ఉంటారని స్పష్టం చేసింది. అజారుద్దీన్‌ కాకుండా మిగతా ఐదుగురే అసలైన అపెక్స్‌ కమిటీ అని.. ఐదుగురం కలిసి తీసుకున్న నిర్ణయమే షోకాజ్‌ నోటీసులని పేర్కొంది. అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటనతో హెచ్​సీఏలో విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.

అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ ఎన్నికై ఏడాదిన్నర అవుతోంది. ఈ మధ్యకాలంలోనే అజారుద్దీన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. రంజీ ప్లేయర్‌ల ఎంపికలో పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని.. తనకు సంబంధించిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పుమన్నాయి. ఆది నుంచే హెచ్​సీఏలో​ వర్గపోరు మొదలైంది. ఇప్పుడు అవి తారాస్థాయికి చేరుకున్నాయి. కొందరు వ్యక్తుల అవినీతికి అడ్డుపడుతున్నందుకే తనపై తిరుగుబాటు చేస్తున్నారని అజారుద్దీన్‌ పేర్కొన్నారు. విజయానంద్‌ కుమార్తె అండర్‌-19 అబ్జర్వర్‌గా వెళ్లిందని.. ఆమెకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహిస్తూ విజయానంద్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. 25 ఏళ్లుగా హెచ్​సీఏను కొందరు వ్యక్తులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయల నిధులు వస్తున్నా.. ఉప్పల్ స్టేడియం తప్ప ఒక్క మైదానమూ ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదన్న అజారుద్దీన్.. అంబుడ్స్‌మెన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. హెచ్​సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం.. అంబుడ్స్‌మెన్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. హెచ్​సీఏ ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

అధ్యక్షుడి అంగీకారం లేకుండా వారు చేస్తున్నది అనైతికం. అధ్యక్షుడి సమ్మతితోనే భేటీ కావాలి. గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కొందరి చేతుల్లోనే ఎందుకు ఉంది. వేరే సెక్రటరీలు ఎందుకు బాధ్యతలు చేపట్టలేదు. అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు 25 ఏళ్లుగా బ్లాక్‌ మెయిలింగ్‌ చర్యలకు పాల్పడుతున్నారు. ఈ బ్లాక్‌ మెయిలింగ్‌ కార్యక్రమాలు ఇప్పుడు ఆగాలి. లేదంటే ఎప్పటికీ ఆగవు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎప్పటికీ మెరుగుపడదు. అజారుద్దీన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు

అజారుద్దీన్‌ గురువారం నుంచి హెచ్​సీఏ అధ్యక్షుడు కాదని అపెక్స్ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదని.. అవసరమైతే అజారుద్దీన్‌ కోర్టుకు వెళ్లి పోరాటం చేసుకోవచ్చని సూచించింది.

ఇదీ చూడండి: Azharuddin: హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.