తెలంగాణకు భవనాల అప్పగింత ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే కొన్ని భవనాల అప్పగింత పూర్తి కాగా మిగిలిన వాటికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. సచివాలయంలో ఉన్న బ్లాకులను ఇరు రాష్ట్రాల అధికారులు పరిశీలించారు. సాయంత్రం అధికారికంగా వీటిని అప్పగించనున్నారు. మరోవైపు లక్డీకాపూల్‌లోని హెర్మిటేజ్ భవనంతో పాటు సీఐడీ కార్యాలయాన్ని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారు.
ఇదీ చూడండి : తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు శుభవార్త