ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సచివాలయ భవనాలను అధికారులు తెలంగాణకు పూర్తిగా అప్పగించారు. సచివాలయంలోని అన్ని బ్లాకుల్లోని ఏపీ సంబంధిత ఫైల్స్, సామగ్రిని తరలించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో అప్పగింత ప్రక్రియ పూర్తైనట్లు పత్రాలు మార్చుకున్నారు. ఇవాళ్టితో సచివాలయం మొత్తం తెలంగాణ ఆధీనంలోకి వచ్చినట్లయింది. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఇలాగే కొనసాగాలని అధికారులు ఆకాంక్షించారు.
ఇదీ చూడండి : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల