ఆంధ్రప్రదేశ్ విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ, త్వరలో మొదలు కానున్న నామినేషన్ల ప్రక్రియ సమాచారాన్ని నివేదించారు. ఈ భేటీ అనంతరం నేరుగా ఎన్నికల కమిషన్ కార్యాలయానికి రమేశ్ కుమార్ వెళ్లారు.
మధ్యాహ్నం 3 గంటలకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు.. ఎస్ఈసీని కలవనున్నారు. ఎన్నికల కమిషనర్‌తో సమావేశానికి హాజరుకానున్న పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్.. తొలి దశ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఎన్నికల రిజర్వేషన్లు, నామినేషన్ల అంశంపై సమాలోచనలు చేస్తారు. అలాగే సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చలు జరుపుతారు.
- ఇదీ చూడండి : విశాఖలో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుకు తెలంగాణ నో