ప్రమాదంలో గాయపడిన దంపతులను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ కాపాడారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన శంకరమంచి లక్ష్మీనారాయణ దంపతులు నరసరావుపేట వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నారు. కట్టుబడివారిపాలెం యూటర్న్ వచ్చేసరికి పక్కనే ఉన్న రెస్టారెంట్లో నుంచి హఠాత్తుగా యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొట్టడంతో దంపతులు ఇద్దరూ కిందపడ్డారు . అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి ప్రమాద సంఘటన చూసి వాహనాన్ని నిలిపి వారికి ధైర్యం చెప్పారు. సమీపంలోని ఆర్.ఎం.పి వైద్యున్ని పిలిపించి ప్రాథమిక వైద్యం అందించారు . అనంతరం 108 అంబులెన్స్ పిలిపించి చికిత్స కోసం నరసారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి కాన్వాయ్ రాక చూసిన ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ట్రాక్టరు, జీపు ఢీ... 10మందికి గాయాలు