ETV Bharat / state

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం - మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

author img

By

Published : Feb 21, 2022, 9:13 AM IST

Updated : Feb 21, 2022, 2:57 PM IST

09:11 February 21

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు.

శ్రమించినా ఫలితం లేకపోయింది: అపోలో వైద్యులు

గౌతమ్‌రెడ్డి ఇంటి వద్దే కుప్పకూలారని జూబ్లీహిల్స్​ అపోలో వైద్యులు ప్రకటించారు. ఉ.7.45 గం.కు గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారని తెలిపారు. స్పందించని స్థితిలో గౌతమ్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చారని వెల్లడించారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదన్నారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని.. గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు ఉదయం 9.16 గంటలకు అపోలో వైద్యులు ప్రకటించారు.

గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం నిన్ననే హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన చివరిసారిగా దుబాయ్‌లోని ఖలీజ్ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు గౌతమ్‌ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.

గౌతమ్‌రెడ్డి తొలిసారిగా 2014లో ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్‌ రికార్డు సృష్టించారు. 2019లో రెండో పర్యాయం ఆయన బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించి కేబినెట్‌ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు.

మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రొఫైల్‌

  • తల్లిదండ్రులు: మేకపాటి రాజమోహన్‌ రెడ్డి-మణిమంజరి
  • పుట్టిన తేదీ: 2-11-1971
  • విద్య: హైదరాబాద్‌ భద్రుకా కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌, యూకేలో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.
  • వ్యాపారం: 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో వ్యాపార జీవితం మొదలుపెట్టారు.
  • రాజకీయ రంగ ప్రవేశం: 2014లో ఆత్మకూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
  • భార్య : మేకపాటి శ్రీకీర్తి
  • పిల్లలు: ఒక కుమార్తె, ఒక కుమారుడు
  • బాబాయ్‌: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్యే)

అత్యంత విచారకరం: ఉపరాష్ట్రపతి

గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సౌమ్యులు, సంస్కారవంతులని వెంకయ్య వెల్లడించారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, పనిపట్ల నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన తెలిపారు. తానంటే గౌతమ్‌రెడ్డి ఎంతో అభిమానం చూపేవారని గుర్తుచేసుకున్నారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు.

కేటీఆర్​ దిగ్భ్రాంతి

గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్​ రెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

తలసాని సంతాపం

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇంద్రకరణ్‌ తీవ్ర సంతాపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాధాకరమన్నారు. మేకపాటి ఆత్మకు సద్గతులు క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని ప్రార్థించారు.

సభాపతి దిగ్భ్రాంతి

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపట్ల సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.

డిప్యూటీ స్పీకర్ సంతాపం

గౌతమ్‌రెడ్డి మృతిపట్ల డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంతాపం తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆయన కోరుకున్నారు.

నారాయణ సంతాపం

మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల సీపీఐ నారాయణ సంతాపం తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Last Updated : Feb 21, 2022, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.