ETV Bharat / state

ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ... - ఏపీ హైకోర్టు వార్తలు

ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆ రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ap high court suspended g.o. 15
ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ... ఆ జీవో సస్పెన్షన్​
author img

By

Published : May 8, 2020, 11:36 AM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ప్రైవేటు అన్​ఎయిడెడ్, వృత్తి విద్యాసంస్థల్లో 2019- 20 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సులకు ఫీజులను ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

ఏపీలో ఉన్న 281 కళాశాలలకు రుసుములను నిర్ణయించించిన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్(ఏపీహెచ్​ఈఆర్​ఎమ్​సీ)... తమ సిఫార్సులను ప్రభుత్వానికి పంపింది. కళాశాలల వారీగా 35 వేల నుంచి 70 వేల వరకు రుసుములను సిఫార్సు చేసింది. దీన్ని ఆమోదిస్తూ ఉన్నత విద్యాశాఖ మార్చి 24న జీవో నంబర్​ 15ను జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ 23 ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.

ప్రవేశాలు, రుసుములు నియంత్రణ కమిషన్​(ఏఎఫ్​ఆర్​సీ) చేసిన సిఫార్సులు పెండింగ్​లో ఉండగా.. ఏపీహెచ్​ఈఆర్​ఎమ్​సీ రుసుములను సిఫార్సు చేయడానికి వీల్లేదని కళాశాలల యాజమాన్యాల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆది నారాయణరావు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విద్యా సంవత్సరం ప్రథమంలో రుసుములను ఖరారు చేయాల్సి ఉండగా.. చివర్లో నిర్ణయించడం సరికాదన్నారు.

మూడేళ్లకోసారి కోర్సుల రుసుములను నిర్ణయించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఏపీహెచ్​ఈఆర్​ఎమ్​సీ ఏడాదికే రుసుములను సిఫార్సు చేసిందన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 15ను సోమవారం వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీహెచ్​ఈఆర్​ఎమ్​సీ ఛైర్మన్లను ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

ఇదీ చూడండి: స్టైరీన్ లీకేజీ... విశాఖలో విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.