ETV Bharat / state

ప్రతిదీ వినడానికే ఉన్నాం: ఏపీ హైకోర్టు - ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కామెంట్స్

ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్న అంశం, హెబియస్‌ కార్పస్ వ్యాజ్యాల విచారణను సుప్రీం నిలిపివేసినట్టు.... ఏపీ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తదనుగుణంగా సుప్రీం తీర్పు వచ్చేవరకూ విచారణ వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. అంతకముందు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి మీరు కోర్టును దూషించాలనుకుంటే... అలానే చేయండి... ప్రతిదీ వినడానికే మేమిక్కడ ఉన్నామని పేర్కొంది.

ap hc
ప్రతిదీ వినడానికే ఉన్నాం: ఏపీ హైకోర్టు
author img

By

Published : Dec 19, 2020, 7:16 AM IST

Updated : Dec 19, 2020, 9:57 AM IST

ఆంద్రప్రదేశ్​ వ్యాప్తంగా వివిధ ఘటనలపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ వ్యాజ్యాల విచారణ సందర్భంగా.. ఆ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో నిర్ణయిస్తామని ఏపీ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. ఈ విచారణ నుంచి జస్టిస్ రాకేశ్‌కుమార్ తప్పుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ వ్యాజ్యం వేయగా.... శుక్రవారం దీని విచారణ ప్రారంభమవగానే స్పందించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది వివేకానంద.... ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై తాము సుప్రీంలో అప్పీల్ చేశామన్నారు. అక్కడ విచారణ జరగనున్న నేపథ్యంలో... ఏపీ హైకోర్టులో విచారణను మధ్యాహ్నం లేదా సోమవారం చేపట్టాలని కోరారు.

మధ్యాహ్నం 2గంటల 15 నిమిషాలకు విచారిస్తామని ధర్మాసనం చెప్పగా... వ్యక్తిగత కారణంతో రాలేనని... సోమవారానికి వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం తరఫు మరో న్యాయవాది మోహన్‌రెడ్డి కోరారు. న్యాయస్థానం దానికి నిరాకరించగా.... చాలా అన్యాయమని మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణను కోర్టు రికార్డ్ చేస్తుందని తెలుసని... అందుకే కోర్టు చాలా అన్యాయధోరణితో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతిదీ వినడానికే మేమిక్కడ ఉన్నామని ధర్మాసనం వ్యాఖ్యానించగా... విని న్యాయం జరిగేలా చూడటం కోసమే మీరు ఉన్నారని మోహన్‌రెడ్డి బదులిచ్చారు.

విధుల్ని నిజాయతీగా నిర్వర్తించేందుకు ఇక్కడనున్నామని ధర్మాసనం పేర్కొంది. పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సీనియర్ న్యాయవాది కోరగా.. ఆ విషయంలో జడ్జిలుగా తాము ప్రమాణం చేశామని.. దానికి కట్టుబడి ఉంటామని కోర్టు గుర్తుచేసింది. విచారణ సోమవారానికి వాయిదా వేయాలని ఆయన మరోసారి కోరగా.... మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండంటూ ధర్మాసనం బదులిచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం రోజుకో న్యాయవాదిని నియమించుకుంటోందని కోర్టు వ్యాఖ్యానించగా... అది పార్టీల ప్రత్యేక హక్కు అని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

కేసు వాయిదా వేయాలా లేదా అన్నది తమ ప్రత్యేక హక్కు అని ధర్మాసనం తెలిపింది. న్యాయవాదికి సౌకర్యంగా లేనప్పుడు వాయిదా వేయాలని మోహన్‌రెడ్డి కోరగా.. మీరు కోర్టును దూషించాలంటే... అలానే చేయాలని... ప్రతిదీ వినడానికే ఇక్కడ ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. తన విజ్ఞప్తిని దూషణగా భావించొద్దని.. అలా అనుకుంటే తానేమీ చేయలేనన్నారు. మీకు ఏమైనా చెప్పే స్వేచ్ఛ ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారణ వాయిదా వేసింది. ఆ సమయానికి సుప్రీం స్టే ఇచ్చిందని జీపీ వివేకానంద ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పు వచ్చేవరకూ విచారణను వాయిదా వేస్తునట్టు ఏపీ హైకోర్టు పేర్కొంది.

ఇదీ చదవండి: రజనీ వెనకున్న ఆ 'రాజకీయ శక్తులు' ఎవరు?

Last Updated : Dec 19, 2020, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.