ETV Bharat / state

బ్లాక్ ఫంగస్‌ ఇంజెక్షన్లపై సమగ్ర నివేదిక ఇవ్వండి: ఏపీ హైకోర్టు

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఇంజెక్షన్లను సమకూర్చుకునేందుకు, వివిధ రాష్ట్రాలకు కేటాయింపుల్లో అనుసరిస్తున్న వైఖరేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రాల వారీగా నమోదైన బ్లాక్‌ ఫంగస్‌ కేసులెన్ని, ఎన్ని ఇంజెక్షన్లు కేటాయించారు, నిల్వలెన్ని ఉన్నాయి? ఫంగస్‌ కేసుల సంఖ్య ఆధారంగా దామాషా ప్రాతిపదికన ఇంజెక్షన్లు కేటాయించారా? లేదా? తదితర వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

ap-high-court-on-central-govt-over-black-fungus-reports
బ్లాక్ ఫంగస్‌ ఇంజెక్షన్లపై సమగ్ర నివేదిక ఇవ్వండి: హైకోర్టు
author img

By

Published : Jun 8, 2021, 8:48 AM IST

బ్లాక్ ఫంగస్‌ ఇంజెక్షన్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించాలని గత విచారణలో ఆదేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వ్యవహరించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మూడోదశను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

కార్పొరేట్‌ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, కోరుతూ అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్ర ప్రసాద్‌, కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు తోట సురేశ్‌బాబు మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫు సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ వాదనలు వినిపించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 1,770 బ్లాక్‌ఫంగస్‌ కేసులున్నాయని కేంద్రం ఇటీవల కేటాయించిన ఇంజెక్షన్లు బాధితులకు ఏమాత్రమూ సరిపోవన్నారు. మూడోదశ పొంచి ఉన్నందున వైద్య సిబ్బంది సంఖ్యను తాత్కాలిక ప్రాతిపదికన పెంచేందుకు ఏం చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎస్‌జీపీ బదులిస్తూ.. 38వేల మంది అదనపు సిబ్బందిని నియమించామన్నారు. తాజా వివరాలతో మెమో దాఖలు చేస్తామన్నారు.

‘మిస్సీ’ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలించాలి

కొవిడ్‌ నుంచి కోలుకున్న పిల్లల్లో వచ్చే మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌-మిస్సీ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కింద చేర్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. నియోనేటల్‌, చిన్నపిల్లల వార్డులను మరికొన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని స్పష్టంచేసింది. విపత్కర పరిస్థితులు కొనసాగేలా ఉన్నందున వైద్య సేవల నిమిత్తం అదనంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది అవసరమని పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమోను పరిశీలిస్తే ఎంబీబీఎస్‌, నర్సింగ్‌ తుది సంవత్సర విద్యార్థులకు గౌరవ వేతనం చెల్లిస్తూ విధుల్లోకి తీసుకున్నారని స్పష్టమవుతోందని పేర్కొంది. కొవిడ్‌ ఆసుపత్రుల నిర్వహణకు ముఖ్యమైన పారామెడికల్‌ సిబ్బంది నియామకానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మెమో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.