న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వేసిన పిటిషన్‌పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ ఇచ్చిన లిఖిత పూర్వక ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ నెల 18వ తేదీన జరిగిన విచారణ తర్వాత కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్, ట్రాయ్‌తో పాటు పలువురు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. వీరిని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ పై విశాఖ న్యాయవాది నిమ్మి గ్రేస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇదీ చదవండి : పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు: పవన్ కల్యాణ్