ETV Bharat / state

ఏపీ హైకోర్టులో జీవో నంబర్​ 1పై విచారణ.. రేపటికి వాయిదా

AP High Court GO No 1: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్​లోని చర్చనీయాంశమైన అంశం జీవో నంబర్​ 1. ప్రముఖ రాజకీయ నాయకులు అందరు ఈ జీవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చేశారు. భోగి పండుగ రోజు ఈ జీవో కాఫీలను మంటల్లో కలిపారు. ఈ అంశంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. జీవో నంబర్‌ 1పై విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Investigation of Geo No. 1 in AP High Court
ఏపీ హైకోర్టులో జీవో నంబర్​ 1పై విచారణ
author img

By

Published : Jan 23, 2023, 6:53 PM IST

AP High Court GO No 1: జీవో నంబర్‌ 1పై విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్​పై విచారణ చేపట్టగా.. సీజే ధర్మాసనం ఎదుట పిటిషనర్లు, ఏజీ, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. జీవో నం.1పై హైకోర్టులో రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.

జీవో నం.1పై హైకోర్టులో రేపు కూడా కొనసాగనున్న వాదనలు రహదారులపై బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహణకు అనుమతి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ -1ను ఈరోజు(జనవరి 23) వరకు సస్పెండ్​ చేస్తూ.. ఈనెల 12వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

విచారణ ఇలా సాగింది: జీవో నెం 1 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి జీవో ఎప్పుడైనా వచ్చిందా అని హైకోర్టు ప్రశ్నించింది. స్వాతంత్య్రానికి ముందైనా ఇలాంటి జీవో ఉందా అని ప్రశ్నలు సంధించింది. బ్రిటిష్ వాళ్లు ఈ చట్టం ఉపయోగిస్తే.. స్వాతంత్య్ర పోరాటం జరిగేదా అని హైకోర్టు నిలదీసింది. ఇదంతా చూస్తుంటే మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావట్లేదని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సుప్రీం కోర్టు ఏమి చెప్పింది: జీవో నెం 1పై హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఈనెల 20న విచారణ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది. కేసు ప్రామాణికతపై ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టట్లేదని సీజేఐ స్పష్టం చేశారు. నేడు విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. వాద, ప్రతివాదులు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. అన్ని ఆప్షన్స్‌ ఓపెన్‌గా ఉంచుతున్నట్లు తెలిపింది.

అసలు ఈ జీవో ఎందుకు తీసుకొచ్చారు: కందుకూరు, గుంటూరు ఘటనలను దృష్యా...జీవో నెంబర్ 1ను తీసుకువస్తున్నట్లు జనవరి మొదట్లో హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. విపక్షాలు, ప్రజాసంఘాల గొంతు నొక్కేందుకే ఈ జోవో తెచ్చారంటూ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌండ్‌ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే జోవో నెంబర్‌ 1ను రద్దు చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి తాత్కాలికంగా జీవోను సస్పెండ్ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.