ETV Bharat / state

అమరావతి పాదయాత్ర రథం సెక్యూరిటీ గార్డులకు ముందస్తు బెయిల్‌

Anticipatory Bail To Security Guards: అమరావతి పాదయాత్ర రథం ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్‌ కోసం అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది.

AP
AP
author img

By

Published : Nov 8, 2022, 5:26 PM IST

Anticipatory Bail To Security Guards : ఏపీ అమరావతి పాదయాత్రలో సెక్యూరీటి గార్డ్స్​పై రామచంద్రపురం పోలీసులు నమోదు చేసిన కేసులో.. ఆ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసు నమోదు చేసిన భద్రతా సిబ్బందికి ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్​ దాఖలు చేసింది. పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పాదయాత్రలో భాగంగా రామచంద్రపురం గ్రామం వద్ద రైతులు రథాన్ని నిలిపి ఉండగా.. భద్రతా సిబ్బందిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరా హర్డ్ డిస్క్​లను తీసుకువెళ్లారని.. తిరిగి వారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారని న్యాయవాది లక్ష్మీ నారాయణ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల విధినిర్వహణను అడ్డుకున్నారనే నెపంతో నాన్ బెయిలబుల్ సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారని తెలిపారు. సెక్యూరీటి గార్డ్స్​పై అన్యాయంగా కేసు నమోదు చేశారని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయస్థానం ముగ్గురు సెక్యూరీటి గార్డ్​లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.