ఆన్‌లైన్ ద్వారా సినిమా టికెట్లు (Online Movie Tickets) విక్రయించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government).. దీనిపై అధ్యయానికి ఉన్నతాధికారులతో కమిటీ నియమించింది. టికెట్ల విక్రయంపై (Online Movie Tickets) ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం కావటంతో సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలతో ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక వచ్చేలోగా.. సినిమా వర్గాలతో నేరుగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
ఈనెల 20న సమావేశం
ఈ నెల 20వ తేదీన తలపెట్టిన సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులను ఆహ్వానించింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యాన టిక్కెట్లు అమ్మడంపై ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని.. థియేటర్ల యజమానులు, సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ప్రభుత్వం టికెట్లు విక్రయిస్తే బాగుంటుందని సినీ పెద్దలే ప్రతిపాదించినట్లు ఇటీవల పేర్ని నాని (Perni Nani) ప్రకటించారు.
ఆన్‌లైన్ టికెట్ల విక్రయం (Online Movie Tickets)తో వచ్చే సొమ్మును రియల్ టైమ్‌లోనే థియేటర్ల యజమానులకు బదిలీ చేస్తామని.. 20వ తేదీన జరిగే సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఏపీ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ (Online ticketing portal) నిర్వహించనున్నట్టు వివరించనుంది.
ఇదీ చదవండి.. DRUGS CASE: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటుడు తనీష్