ఇవాళ నిర్వహించే బహిరంగ సెక్యూరిటీల వేలంలో వెయ్యి కోట్ల రుణ సమీకరణకు.. ఏపీప్రభుత్వం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. 17 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ.500 కోట్ల రుణం కావాలంటూ ప్రతిపాదించింది. వడ్డీ ధర నేటి వేలం పూర్తయ్యాక తేలుతుంది. దీన్ని కలుపుకుంటే ఒక్క సెప్టెంబర్‌లోనే(ap government made 5000 crore loans in September month) రాష్ట్రం.. రూ. 5,000 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి రుణం పొందినట్టువుతుంది.
నాలుగు నెలల కాలానికి పదిన్నర వేల కోట్లు రుణంగా తీసుకునేందుకు సెప్టెంబర్ తొలివారంలో కేంద్రం అనుమతివ్వగా.. అందులో సగం మొత్తాన్ని ఒక్క నెలలోనే సమీకరించినట్టవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రుణ పరిమితిని రూ. 42,472 కోట్లుగా కేంద్రం నిర్ణయించగా.. ఆ తర్వాత గతంలో పరిమితికి మించి వాడుకున్న అప్పును మినహాయించి ఈ మొత్తాన్ని రూ. 27,688 కోట్లకు తగ్గించింది.
ఇదీ చూడండి: రూ.21,500 కోట్ల రుణంపై మరింతగా ఆరా!