ETV Bharat / state

కరోనా స్ట్రెయిన్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం..

కరోనా స్ట్రెయిన్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. గత నెల రోజులగా యూకే నుంచి ఆ రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడింది. గత నెల రోజులగా 1148 మంది యూకే నుంచి వచ్చారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇందులో 1040 మందిని ఇప్పటికే గుర్తించామని వెల్లడించింది.

కరోనా స్ట్రెయిన్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం..
కరోనా స్ట్రెయిన్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం..
author img

By

Published : Dec 25, 2020, 9:39 PM IST

కొత్తరకం కరోనా వైరస్‌ దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్రానికి గత నెల రోజులగా 1148 మంది యూకే నుంచి వచ్చారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇందులో 1040 మందిని ఇప్పటికే గుర్తించామని వెల్లడించింది. వీరిలో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారని.. మరో 90 మంది ఇచ్చిన చిరునామాలు సరిపోలడం లేదని తెలిపింది.

982 మందిని గుర్తించి వారిని క్వారంటైన్​కు పంపించామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 982 మందిలో నలుగురికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యిందని వెల్లడించింది. మిగిలిన వారి నుంచి కూడా నమూనాలు తీసి సీసీఎంబీ, ఎన్ఐవీ పుణెకు పరీక్ష నిమిత్తం పంపినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.

కొత్త రకం కరోనా వైరస్ వేరియంట్ ఆనవాళ్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఫలితాలు రావడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ ఈ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు.

ఈ నెల 28 నుంచి కృష్ణాజిల్లాలో ఆరు ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకే కృష్ణాజిల్లాలో ఈ డ్రైరన్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'సెటిల్ చేసుకున్నా క్రిమినల్ కేసు రద్దు కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.