విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద స్థలాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. అనంతరం ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ప్రమాద స్థలాన్ని సాంకేతిక నిపుణులు పరిశీలిస్తారని తెలిపారు. దిల్లీ నుంచి మరికొందరు నిపుణులు వస్తున్నారన్నారు. ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు వేగంగా సహాయచర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
గ్యాస్ లీక్ ఘటన సహాయక చర్యల్లో పాల్గొంటూ పలువురు పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా కేజీహెచ్, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిని డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించనున్నారు.