ETV Bharat / state

ప్రవాసాంధ్రులకు పెయిడ్​ క్వారంటైన్​లు: కృష్ణబాబు - ఏపీ కోవిడ్ టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు వార్తలు

ఆంధ్రప్రదేశ్​కు 15 వేల నుంచి 20 వేల మంది విదేశాల నుంచి ఏపీ వాసులు వచ్చే అవకాశం ఉందని కొవిడ్ టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. సోమవారం ఏపీ వాసులతో అమెరికా నుంచి మొదటి విమానం హైదరాబాద్​కు వస్తుందని వెల్లడించారు. వారందరినీ విజయవాడలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.

ప్రవాసాంధ్రులకు పెయిడ్​ క్వారంటైన్​లు: కృష్ణబాబు

author img

By

Published : May 9, 2020, 8:17 PM IST

ఏపీకి వచ్చేందుకు విదేశాల్లోని 30 వేల మంది రాష్ట్ర ప్రజలు రిజిస్ట్రేషన్​ చేసుకున్నారని కొవిడ్ టాస్క్​ఫోర్స్ ఛైర్మన్ కృష్ణ బాబు తెలిపారు. అయితే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం రాష్ట్రానికి 15 వేల నుంచి 20 వేల మంది వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వారిని తీసుకొచ్చే విమానాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వస్తాయని వెల్లడించారు. ఆయా విమానాశ్రయాల్లో మన వారిని సిద్ధంగా ఉంచుతామని తెలిపారు.

విదేశాల నుంచి ఏపీకి చేరుకున్న వారికి 2 రకాల క్వారంటైన్‌లు సూచిస్తున్నామని కృష్ణబాబు వెల్లడించారు. వారు పెయిడ్, ఉచిత క్వారంటైన్‌ ఎంచుకోవచ్చని చెప్పారు. హోటల్‌లో క్వారంటైన్‌ చేసేందుకు తక్కువ ఖర్చుతోనే ఏర్పాట్లు చేస్తున్నారమని చెప్పారు. గల్ఫ్ నుంచి వచ్చే కార్మికులకు ఉచిత క్వారంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. వీరందరికీ పరీక్షలు చేసి క్వారంటైన్ లేదా కొవిడ్ ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2 వారాల క్వారంటైన్ ఉన్నవాళ్లు తర్వాత మళ్లీ 14 రోజుల హోమ్ క్వారంటైన్​ పాటించాలని కృష్ణబాబు స్పష్టం చేశారు.

ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేవాళ్లు సిద్ధంగా ఉండాలని కృష్ణబాబు సూచించారు. ఏపీ వాసులతో అమెరికా నుంచి మొదటి విమానం ఈ నెల11న హైదరాబాద్ వస్తుందని కృష్ణబాబు వెల్లడించారు. సోమవారం వచ్చే వారందరినీ విజయవాడలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో చిక్కుకున్న వలస కూలీలను స్వస్థలాలకు పంపిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 11 రైళ్ల ద్వారా 11,868 మందిని ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు పంపించామని కృష్ణబాబు వివరించారు.

ప్రవాసాంధ్రులకు పెయిడ్​ క్వారంటైన్​లు: కృష్ణబాబు

ఇవీ చూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.