ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీ కోవిడ్ న్యూస్

ap-corona-cases-health-bulletin
ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : May 5, 2020, 11:13 AM IST

Updated : May 5, 2020, 12:05 PM IST

11:10 May 05

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు

హెల్త్ బులెటిన్
హెల్త్ బులెటిన్

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8263 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 67 కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య 1717కి చేరిందని ప్రకటించింది. ఇవాళ్టి 67 కేసుల్లో గుజరాత్‌ నుంచి వచ్చిన 14 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు హెల్త్ బులెటిన్​లో తెలిపింది. కరోనాతో ఇవాళ మరొకరు మృతి చెందగా... మొత్తం కరోనా మరణాలు 34కు చేరినట్లు ప్రకటించింది. కరోనా నుంచి కోలుకుని 589 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించింది. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 1094 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. 

జిల్లాల వారీగా కొత్త కేసులు
 
  • కర్నూలు జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు
  • గుంటూరు జిల్లాలో 13 ‌ కేసులు
  • కృష్ణా జిల్లాలో 8 కేసులు
  • విశాఖ, అనంతపురం, కడప జిల్లాల్లో రెండేసి కేసులు
  • నెల్లూరులో ఒక కేసు

ఇదీచూడండి: నేడు మంత్రివర్గం భేటీ.. లాక్​డౌన్​పై కీలక నిర్ణయం

Last Updated : May 5, 2020, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.