ETV Bharat / state

ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి: జగన్

పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు లే అవుట్లను అభివృద్ధి చేయాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించాలని అధికారులకు సూచించారు. మధ్యతరగతి ప్రజలకు కూడా సొంత స్థలం, తద్వార సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా క్లియర్‌ టైటిల్‌, వివాదాల్లేని ప్లాట్లు మధ్యతరగతి ప్రజలకు అందుతాయని.... దీనికోసం మేథోమథనం చేసి విధానాన్ని రూపొందించాలని జగన్​ ఆదేశించారు. మంగళగిరి- తాడేపల్లి మున్సిపాలిటీలు కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జగన్​.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.

ap news
ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి: జగన్
author img

By

Published : Jan 7, 2021, 7:22 PM IST

పట్టణ, నగరాల్లోని పేద ప్రజలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఏపీ సీఎం జగన్​ ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ది శాఖపై సమీక్షించిన జగన్​ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో పట్టణాలు, నగరాల్లో రాజీవ్‌ స్వగృహ పేరిట ఉన్న కార్యక్రమంలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇచ్చేవారని.. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా, క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని సీఎం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను తయారుచేసి లబ్ధిదారులకు కేటాయిస్తుందని ఏపీ సీఎం వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుగోలు చేస్తున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయని, సరైన టైటిల్‌ సహా అన్నిరకాల అనుమతులు ఉన్నాయా లేవా అనే భయాలు ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వమే లే అవుట్ల అభివృద్ధిని చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవన్నారు. ప్రభుత్వం లాభాపేక్షలేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్యతరగతి ప్రజలకు వివాదాలు లేకుండా, క్లియర్‌ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలు అందుబాటులోకి వస్తాయన్నారు. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఈ ప్లాట్లను అందించాలన్నారు. ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. దీనిపై మేథోమథనం చేసి ఒక పాలసీని తీసుకురావాలని సీఎం సూచించారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో దాదాపు 16 వేలకుపైగా లే అవుట్స్‌ వచ్చాయన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో 17 వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 17వేల కాలనీలు కడుతోందని ఏపీ సీఎం తెలిపారు. కొన్నిచోట్ల నగర పంచాయతీలుగా కూడా చేస్తున్నామన్నారు. పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌.. ఇవన్నీకూడా ఈ కాలనీల్లో తీసుకు రావాలని ఆదేశించారు.

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆదేశం..

మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలతో మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి సంబంధించి 1000 కోట్లతో డీపీఆర్‌ను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమిలి నుంచి భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి 6 లైన్ల బీచ్‌ రోడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ రహదారిలో భాగంగా గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నానికి ఒక చిహ్నంగా మిగిలిపోతుందన్న జగన్​ ... దీనిపై సమగ్ర కార్యాచరణకు ఆదేశాలు ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.