దిల్లీలో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. కేంద్రమంత్రితో సుమారు అరగంటపాటు ఏపీ సీఎం సమావేశమయ్యారు.
పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ.55,656 కోట్లను ఆమోదించాలని కోరారు. భూసేకరణ, పునరావాస పనులకు అయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాలని కోరారు.
ఇదీ చూడండి: పీఆర్‌సీపై చర్చలకు సిద్ధమైన తెలంగాణ సర్కార్