ETV Bharat / state

మా నీటినే.. మేం వాడుకుంటాం: ఏపీ సీఎం జగన్ - కృష్ణా జలాలపై జగన్ కామెంట్స్ న్యూస్

కృష్ణా పరివాహక ప్రాజెక్టుల కింద రాష్ట్రానికి కేటాయించిన నీళ్లను మాత్రమే వాడుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కరవుతో అల్లాడుతున్న రాయలసీమ, ప్రకాశం నెల్లూరు ప్రాంతాలకు తాగునీరు అందించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం తగదన్నారు. కేటాయింపులకు మించి నీటిని వాడుకోవడానికి కృష్ణా వాటర్ బోర్డు అంగీకరించదని.. దీనిపై ఆందోళన అవసరం లేదని జలవనరుల శాఖ అధికారుల సమీక్షలో జగన్ స్పష్టం చేశారు.

మా నీటినే.. మేం వాడుకుంటాం: ఏపీ సీఎం జగన్

author img

By

Published : May 12, 2020, 9:44 PM IST

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల గొంతు తడిపేందుకే.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతున్నామన్నారు. కేవలం పది రోజులకు మించి.. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకెళ్లే పరిస్థితి ఉండదని.. ఈ విషయంలో తెలంగాణ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే.. వాడుకుంటామన్నారు.

మనం కట్టుకుంటున్న ప్రాజెక్టు ఇది

మనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి ఒక సదుపాయం మాత్రమే ఇది అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి పరిమితులు విధించాలనడం ఎంతవరకు సమంజసం అని తెలంగాణ ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. కృష్ణా వాటర్​బోర్డు డిస్ప్యూట్స్​ ట్రైబ్యునల్​ (కేడబ్ల్యూడీటీ) ప్రకారమే ఎవరు ఎన్ని నీళ్లు వాడుకోవాలన్నది నిర్ణయించిందని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు ఆ పంపకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. ఎవరైనా మానవత్వంతో ఆలోచన చేయాలన్నారు. మన భూభాగంలో మనం కట్టుకుంటున్న ప్రాజెక్టు అని.. జగన్​ వ్యాఖ్యానించారు.

తప్పు ఎలా అవుతుంది?

శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు మించి ఉండడం మహాకష్టం. ఆ పది రోజుల్లోనే రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలంలో 854 అడుగులకు చేరితే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే నీరు వెయ్యి క్యూసెక్కులు మాత్రమే. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్‌ నుంచి వెళ్లేది గరిష్ఠంగా 9 వేల క్యూసెక్కులే. శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే ఆ మాత్రం నీళ్లైనా వెళ్తాయి. మన కేటాయింపుల ప్రకారం మనం నీటిని తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది.

- ఏపీ సీఎం జగన్

ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.