ETV Bharat / state

ఏపీకి రాజధాని విశాఖనే.. నేను అక్కడికే షిఫ్ట్ అవుతున్నా : సీఎం జగన్ - global investors meeting

AP CM Jagan comments on visakhapatnam Capital : ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఆ రాష్ట్ర రాజధాని కాబోతోందని.. త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నట్లు చెప్పారు. దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం మాట్లాడారు.

AP CM JAGAN
AP CM JAGAN
author img

By

Published : Jan 31, 2023, 1:45 PM IST

ఏపీకి రాజధాని విశాఖనేనంటూ జగన్ కీలక వ్యాఖ్యలు

AP CM Jagan comments on visakhapatnam Capital : విశాఖ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని త్వరలోనే విశాఖకు తరలివెళ్తుందని పునరుద్ఘాటించారు. దిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న జగన్‌.. అదే వేదిక నుంచి ఈ ప్రకటన చేశారు. తాను కూడా విశాఖకు మకాం మారుస్తానన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుందని వెల్లడించిన జగన్‌.. అక్కడికి కూడా రావాలని సదస్సులో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులను కోరారు. అందరినీ మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షించారు.

‘‘మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నా. విశాఖపట్నం రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు." - జగన్​, ఏపీ సీఎం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.