ETV Bharat / state

ఏలూరు బాధితులను పరామర్శించిన జగన్ - ఏలూరుకు చేరుకున్న ఏపీ సీఎం వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అంతు చిక్కని సమస్యతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను తెలుసుకున్నారు.

AP CM JAGAN
ఏలూరు బాధితులను పరామర్శించిన జగన్
author img

By

Published : Dec 7, 2020, 4:33 PM IST

ఏలూరు బాధితులను పరామర్శించిన జగన్

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో.. అంతు చిక్కని సమస్యతో అస్వస్థతకు గురైన వారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతున్న తీరును తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పారు. వారు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు.

ప్రసూతి, శిశు ఆరోగ్య కేంద్రం వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ విషయమై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అధికారులతో సమావేశం కానున్నారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై అయన అధికారులతో చర్చించనున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల పరామర్శ అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఐసీఎంఆర్ సహా మరో నాలుగు కేంద్ర బృందాలు.. ఏలూరు వస్తున్నాయని అధికారులు ఏపీ సీఎంకు తెలిపారు. దిల్లీ ఏయిమ్స్ కు ఇప్పటికే శాంపిల్స్ పంపామని... ప్రాథమికంగా నీటి పరీక్షల్లో ఎటువంటి ఇబ్బందులూ కనిపించలేదని పేర్కొన్నారు. రక్తపరీక్ష ఫలితాలు కూడా సాధారణంగానే వస్తున్నాయన్నారు. అన్ని వైరస్ టెస్ట్​లు నిర్వహించామని..అన్ని నెగెటివ్​గా వచ్చాయని సీఎంకు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.