AP CID Searches in Narayana Education Institutions Head Office: హైదరాబాద్‌లోని నారాయణ విద్యాసంస్థల కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేశారు. మాదాపూర్ మెలాంజ్ టవర్స్‌లోని ఏపీ మాజీ మంత్రి నారాయణకు చెందిన ఎన్‌స్పిరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహించారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు.
అమరావతి భూముల కొనుగోలులో అవకతకలు జరిగాయని ఆరోపణ నేపథ్యంలో సోదాలు చేశామని సీఐడీ అధికారులు పత్రిక నోట్ ద్వారా వెల్లడించారు. ఇవాళ ఉదయం నుంచి ఈ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 40 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలతోపాటు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చదవండి: