ETV Bharat / state

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ ప్రారంభం - సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం (AP Cabinet Meeting) జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.

AP Cabinet Meeting started
AP Cabinet Meeting started
author img

By

Published : Oct 28, 2021, 12:35 PM IST

ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting)ప్రారంభమైంది. ఆ రాష్ట్ర సచివాలయంలో జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో చట్ట సవరణకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు.

ఆలయాల్లో భద్రతకు సీసీ కెమెరాలు, ఇతర చర్యలకు ప్రత్యేకంగా విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం, ‘ఈడబ్ల్యూఎస్‌’ కేటగిరిలోని వారి సంక్షేమ కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇలా దాదాపు 20 నుంచి 25 అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదముద్ర వేయనుంది. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.