ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో తుపాకి చప్పుడుతో ఒక్కసారిగా వాతావరణం మారింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. మదిమల్లు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు విశాఖ గ్రామీణ ఎస్పీ బాబూజీ తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలంలో 4 తుపాకులు, ల్యాండ్‌మైన్, కిట్‌బ్యాగ్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ దళాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహౌండ్స్, ఎస్పీఎఫ్ బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి. కూంబింగ్ సందర్భంగా తారసపడిన మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య అరగంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలాన్ని ఓఎస్డీ కృష్ణారావు, ఏఎస్పీ సతీశ్‌కుమార్ పరిశీలించారు.
ఇవీ చూడండి: సబ్‌ప్లాన్ నిధులపై అఖిలపక్షం ఏర్పాటు స్వాగతిస్తున్నాం: భట్టి