ETV Bharat / state

నిలోఫర్ ఆసుపత్రి ముందు ఆందోళన - nilofer

బకాయి వేతనాలు చెల్లించాలంటూ... నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే.. నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఆసుపత్రి ముందు ఆందోళన
author img

By

Published : Jul 9, 2019, 4:55 PM IST

పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, శానిటేషన్, పేషేంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల జీతాలు రెండు నెలలుగా రావడం లేదని వారు వాపోయారు. గత రెండు రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు జీతాలు రావడం లేదని సంబంధిత కాంట్రాక్టర్​ని అడిగితే... ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తే ఇస్తామని చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని... రెండు రోజుల్లో తమకు రావాల్సిన జీతాలు రాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు.

ఆసుపత్రి ముందు ఆందోళన

ఇవీ చూడండి: "కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి క్షమాపణ చెప్పాలి"

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.