ETV Bharat / state

బస్తీ దవాఖానాల్లోనూ కరోనా పరీక్షలు.. ఈరోజు నుంచి యాంటీజెన్ టెస్టులు

author img

By

Published : Jul 10, 2020, 6:52 AM IST

హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి 167 బస్తీ దవాఖానాల్లోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించడానికి వైద్య, ఆరోగ్య శాఖ సన్నాహాలు చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 90 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా.. వీటి పరిధిని మరింతగా విస్తరించారు. ఇందుకోసం ఆయా ఆసుపత్రుల్లో జ్వర క్లినిక్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.

బస్తీ దవాఖానాల్లోనూ పరీక్షలు
బస్తీ దవాఖానాల్లోనూ పరీక్షలు

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా నిర్ధరణ పరీక్షలను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి 167 బస్తీ దవాఖానాల్లోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించడానికి వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 90 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా.. వీటి పరిధిని మరింతగా విస్తరించారు. నగర పరిధిలో మొత్తంగా 300 వైద్యశాలల్లో ఈ పరీక్షలను అందుబాటులోకి తెస్తున్నారు. గురువారం కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అనుమానితులకే పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగానూ విస్తృత స్థాయిలో యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో యాంటీజెన్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలందరికీ కాకుండా.. కరోనా అనుమానిత లక్షణాలున్నవారికే యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇందుకోసం ఆయా ఆసుపత్రుల్లో జ్వర క్లినిక్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలున్నవారికి విడిగా ఈ క్లినిక్‌ల్లో కరోనా పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా అత్యవసర శస్త్రచికిత్సలు పొందేవారు, ప్రసవానికి వచ్చినవారికి కరోనా నిర్ధరణ పరీక్షలు అవసరమైన సందర్భాల్లో ఈ యాంటీజెన్‌ పరీక్షలతో ఉపయోగం ఉంటుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.

30 నిమిషాల్లోనే ఫలితాలు రావడం వల్ల చికిత్సలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. అనుమానిత లక్షణాలున్న వారిలో వైరస్‌ను త్వరగా గుర్తించడం ద్వారా కూడా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చు. మున్ముందు పరిస్థితులను బట్టి ప్రాంతీయ ఆసుపత్రులు, అవసరమైతే గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించాలని తీర్మానించారు.

99% కచ్చితమే

* ఈ విధానంలో నమూనా స్వీకరించిన 30 నిమిషాల్లోపే ఫలితం వెల్లడవుతుంది.

* పాజిటివ్‌ ఫలితం వస్తే.. 99 శాతం కచ్చితత్వమేనని నిపుణులు చెబుతున్నారు.

* నెగెటివ్‌ వచ్చిన వ్యక్తిలో కరోనా లక్షణాలుంటే మళ్లీ ఆర్‌టీ పీసీఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించాలి. లక్షణాలు లేకపోతే.. నెగెటివ్‌గా పరిగణిస్తారు.

ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.