మానవ అక్రమ రవాణా అరికట్టడానికి రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. 20 ప్రత్యేక బృందాలను లాంఛనంగా ప్రారంభించారు. తరుణి స్వచ్ఛంద సంస్థ, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ సంయుక్తంగా ఈ బృందాలకు సహకారం అందించనున్నారు. భారతదేశంలో మానవ అక్రమ రవాణా నిరోధించేందుకు తగిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటీష్ డిప్యటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అన్నారు.
అక్రమ రవాణా నిరోధించడానికి తెలుగు రాష్ట్రాల్లోనే మొదట ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని... వీటి పనితీరు బాగుండడం వల్ల దేశవ్యాప్తంగా 330పైగా బృందాలను ఏర్పాటు చేశారని అదనపు డీజీపీ స్వాతిలక్రా తెలిపారు. మహిళల అక్రమ రవాణా నిరోధించడమే కాకుండా.. బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేలా... ప్రత్యేక బృందాలు చూస్తాయని స్వాతిలక్రా తెలిపారు. మానవ అక్రమ రవాణా- పరిణామాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీజీఐ సుమతి వివరించారు.
ఇదీ చూడండి: నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో చాటింగ్.. ఆ తర్వాత...