ETV Bharat / state

తక్కువ సిబ్బంది.. ఒత్తిడిలో అవినీతి నిరోధక శాఖ - అవినీతి నిరోధక శాఖ వార్తలు

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత సిబ్బందిని పెంచకపోవడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు, ఇతర ఉద్యోగులపై పని భారం పెరిగింది. కార్యాలయాల సంఖ్యను పెంచాలంటూ అనిశా గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది.

acb, telangana
అవినీతి నిరోధక శాఖ, తెలంగాణ
author img

By

Published : Feb 8, 2021, 7:32 AM IST

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిపోయింది. తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఉన్న పది ఉమ్మడి జిల్లాల్లో అనిశా కార్యాలయాలుండేవి. ఒక్కోచోట డీఎస్పీ నేతృత్వంలో ఇద్దరు, ముగ్గురు ఇన్స్‌పెక్టర్లతోపాటు 5-6 మంది సిబ్బంది ఉండేవారు. ఆయా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి వ్యవహారాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును వీరు పర్యవేక్షించేవారు.తర్వాత 33 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అలాగే మండలాలు, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలూ పెరిగాయి. కానీ అనిశా కార్యాలయాలు మాత్రం పెరగకపోవడంతో వాటిపై ఒత్తిడి పెరిగిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా అనిశా కేసు నమోదుకు, అభియోగం పత్రం దాఖలుకు చాలా సమయం తీసుకుంటుంది. ఐఎంఎస్‌ కుంభకోణమే ఇందుకు ఓ ఉదాహరణ.

ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేదెప్పుడో..?

జిల్లాలు పెరిగిన నేపథ్యంలో కార్యాలయాల సంఖ్య పెంచాలని అనిశా గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఉమ్మడి జిల్లాల్లో డీఎస్పీ నేతృత్వంలో కార్యాలయాలను కొనసాగిస్తూనే.. కొత్త జిల్లాల్లో సీఐల ఆధ్వర్యంలో నలుగురు సిబ్బందితో కార్యాలయాల ఏర్పాటుకు అనుమతించాలనేది ఆ ప్రతిపాదనల సారాంశం.

ఇదీ చదవండి: రానున్నవి ఆర్‌ఎన్‌ఏ టీకాలు: సీసీఎంబీ డైరక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.