జాతి సంపదకు నెలవైనది ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం.. యావత్ దేశం కొవిడ్‌తో అల్లాడుతున్న తరుణంలో ఉక్కు సంకల్పంతో... తమ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా చికిత్స అందించేందుకు వెయ్యి పడకలు సిద్ధం చేస్తోంది. తమ అంతర్గత నిధులతో వెయ్యి పడకలను విశాఖ ఉక్కు ఇనుముతో... యుద్ద ప్రాతిపదికన తయారు చేస్తోంది. కేంద్ర ఉక్కుశాఖమంత్రితో జరిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వెయ్యి పడకలకు ఆక్సిజన్ సరఫరా కోసం... మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా జరుగుతోంది.
ఉక్కు నగరంలో ఉన్న వేర్వేరు సామాజిక కేంద్రాలు... పలు హాళ్లను కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే... స్టీల్‌ప్లాంట్ జనరల్ ఆసుపత్రిలో 110 పడకలను పూర్తిగా కొవిడ్ రోగులకు కేటాయించి.... చికిత్స అందిస్తున్నారు.
ఆక్సిజెన్ కొరతతో ఇప్పుడు దేశమంతా సతమతమవుతున్న తరుణంలో ఆక్సిజెన్ సరఫరా కోసం విశాఖ ఉక్క ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 13 వరకు 2,200 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. ఇందులో.. అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌కు, మహరాష్ట్రకు ఆక్సిజన్ అందించింది.
ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్: రాష్ట్ర, జాతీయ పరీక్షల పరిస్థితి ఇదీ.!