గాంధీ ఆస్పత్రిలో మరో వివాదం చోటుచేసుకుంది. గాంధీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని ఓ గదిలో... అటెండర్ సహా మరో ఇద్దరు సిబ్బంది.. 2017 నుంచి ఇప్పటివరకు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారి దస్త్రాలను పరిశీలిస్తుండటం అనుమానాలు రేకెత్తిస్తోంది. స్టోర్‌రూమ్ లోపలి నుంచి గడియపెట్టుకుని... ఈ పనులను చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే గాంధీలో ఇంటర్న్‌షిప్ స్కామ్ జరుగుతోందని ఆస్పత్రి నుంచి సరెండర్ అయిన వైద్యుడు వసంత్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇవాళ డీఎంఈకి పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు వైద్య శాఖ అధికారులు లేకుండానే దస్త్రాలను తీసి పరిశీలిస్తుండటం అనుమానాస్పదంగా మారింది.