రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. హైదరాబాద్‌తోపాటు... జిల్లాల్లోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పల్లెలపైనా కొవిడ్ ప్రతాపం చూపడం వల్ల అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,092 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో బాధితుల సంఖ్య 73, 050కు చేరింది. మరో 13 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 589కు చేరింది. తాజాగా 1,289 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఇప్పటివరకు 52,103 మంది మహమ్మారిని జయించారు. ప్రస్తుతం 20,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 535 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 169, మేడ్చల్లో 126, కరీంనగర్ జిల్లాలో 123 కరోనా కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 5,43,489 మందికి పరీక్షలు జరిపారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం