సీఎం, మంత్రులు, అధికారుల పేర్లతో 50 బాటిళ్ల పార్శిళ్లు వచ్చిన ఘటన సికింద్రాబాద్ పోస్టాఫీస్‌లో చోటుచేసుకుంది. బాటిళ్లను గుర్తించిన పోస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. బాటిళ్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని అనుమానించిన పోలీసులు... శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు పార్శిళ్లలో కొన్ని తాగునీటి బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు బయట కలుషిత నీళ్లు తాగితే ప్రజాప్రతినిధులు ఏసీ రూముల్లో కూర్చుని మినరల్ వాటర్ తాగుతున్నారు. ఈ విషయంపై సందేశాన్ని ఇచ్చేందుకే ఓయూ విద్యార్థులే బాటిళ్లను పంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఇదీ చూడండి :అశ్లీల వెబ్ సైట్లో యువతి పేరు.. గూగుల్‌కు హైకోర్టు నోటీసులు