ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు.
కొవిడ్ -19 నేపథ్యంలో ఆలయంలో వాహనసేవ ఏకాంతంగా జరిగింది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి. 'మే నెలలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభించే అవకాశం'