పశువులను తరలించటానికి ఉద్దేశించిన వాహనాల్లోనే వాటిని తరలించాలని.. ఇతర రవాణా వాహనాలను జంతువుల రవాణాలో వినియోగించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి సందీప్ సుల్తానియా జిల్లా రవాణా అధికారులు, వెటర్నరీ అధికారులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో స్పష్టం చేశారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఈ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జంతువుల కోసం పార్టిషన్స్ చేయబడిన, వాటి కోసమే ప్రత్యేకించి తయారు చేసిన వాహనాల్లోనే వాటిని తరలించాలని.. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇతర వాహనాలలో తరలిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందు కోసం చెక్ పోస్టులు, అంతర్ రాష్ట్ర రూట్లలలో నిఘా పెంచాలని పేర్కొన్నారు. వివిధ జంతువులను తరలించేందుకు వాటి పరిమాణానికి తగిన పార్టిషన్స్ తప్పక కల్పించాలని తెలిపారు.
జంతువుల తరలింపునకు ఇవి పాటించాలి..
- ఆవులు, గేదెలు, దున్నపోతులు -2 చ. మీ
- గుర్రాలు - 2.25 చ.మీ
- మేకలు గొర్రెలు- 0.3 చ.మీ
- పందులు - 0.6 చ.మీ
- కోళ్లు 40 - చ.మీ
- ఇదీ చూడండి:ఆడవారికి కోస్తే కన్నీరు.. మగవారికి కొంటే కన్నీరు...