ETV Bharat / state

అభివృద్ధి పనుల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు: తలసాని

అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. హైదరాబాద్​ అమీర్​పేట డివిజన్​లో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

అభివృద్ధి పనుల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు: తలసాని
అభివృద్ధి పనుల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు: తలసాని
author img

By

Published : Jun 10, 2021, 12:51 PM IST

హైదరాబాద్​లోని అమీర్​పేట డివిజన్​లో పలు అభివృద్ధి పనులను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ ప్రారంభించారు. ప్రశాంత్​నగర్​లో బిటి రోడ్డు, శివబాగ్ కాలనీ, కొత్త పోలీస్ స్టేషన్ వద్ద వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఎస్సార్​నగర్​లో కమిటీ హాల్​నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్​ సరళ, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ పాల్గొన్నారు

ఇదీ చదవండి: Viral: 'ఆలూ చిప్స్​'తో కర్రీ- ఇదేం వెరైటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.