ETV Bharat / state

అన్ని జిల్లాల్లో జంతు సంరక్షణ కేంద్రాలు: అరవింద్‌ - hyderabad latest news

హైదరాబాద్ నాగోల్‌ ఫత్తుల్​గూడ కేంద్రం నిర్వహణ బాధ్యతలను పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థకు అధికారికంగా అప్పగిస్తున్నట్లు పురపాలక ముఖ్యకార్యదర్శి అరవింద్​కుమార్ ప్రకటించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, ప్రముఖ సినీనటి అమల అక్కినేని, పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థ అధ్యక్షురాలు వాసంతి వాడి, డాక్టర్ రమణారెడ్డితో కలిసి ​సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.

అన్ని జిల్లా arvind kumarకేంద్రాల్లో జంతు సంరక్షణ కేంద్రాలు: అరవింద్‌
అన్ని జిల్లా కేంద్రాల్లో జంతు సంరక్షణ కేంద్రాలు: అరవింద్‌
author img

By

Published : Dec 3, 2020, 5:43 AM IST

రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో జంతు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నాగోల్‌ ఫత్తుల్‌గూడలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, ప్రముఖ సినీ నటి అమల అక్కినేని, పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థ అధ్యక్షురాలు వాసంతి వాడి, డాక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో అంబర్‌పేట, కూకట్‌పల్లి, మహాదేవ్‌పూర్ ప్రాంతాల్లో ఐదు యానిమల్ కేర్ సెంటర్ ఉన్నాయని అరవింద్​కుమార్​ తెలిపారు. ఫత్తుల్​గూడ కేంద్రం నిర్వహణ బాధ్యతలను పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థకు అధికారికంగా అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌లో అనూహ్యంగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా జంతు సంరక్షణ నిర్వహణలో భాగంగా కుక్కలు, పిల్లులు, ఎలుకలు, పాములను సంరక్షించడం మన బాధ్యతన్నారు. నగరీకరణలో భాగంగా జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసినట్లు తెలిపారు.

ఇవీచూడండి: 'చుట్టుగుంట చెరువు' ధ్వంసం​పై విచారణకు ఎన్టీజీ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.