ETV Bharat / state

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు హాజరుపై ఏపీ విద్యార్థుల ఆందోళన

లాక్​డౌన్​ కారణంగా తెలంగాణలో నిలిచిన ఇంటర్​ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. నగరంలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు... పరీక్షల వాయిదా సమయంలో స్వగ్రామాలకు చేరుకున్నారు. తాజా ప్రకటనతో పరీక్షలకు ఎలా హాజరుకావాలో తెలియక సతమతమవుతున్నారు.

ap students worry about inter exams in telangana
తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు హాజరుపై ఏపీ విద్యార్థుల ఆందోళన
author img

By

Published : May 11, 2020, 10:23 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో నిలిచిన ఇంటర్మీడియట్‌ భూగోళశాస్త్రం, మోడల్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు... లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎలాగోలా తమ స్వగృహాలకు చేరుకున్నారు. ప్రభుత్వం తాజా ప్రకటనతో పరీక్ష రాసేందుకు వారు ఇప్పుడు హైదరాబాద్​కు ఎలా చేరుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

ప్రజారవాణా వ్యవస్థ పున:ప్రారంభం కాకముందే పరీక్షల తేదీని ప్రకటించడం వారిని అయోమయానికి గురి చేస్తోంది. ఐఏఎస్‌ సాధన లక్ష్యంగా బోధించే ఇంటర్‌, డిగ్రీ అయిదేళ్ల సమీకృత కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రధానంగా ఈ సమస్య ఎదురైంది. పరీక్ష సమయంలో వసతిగృహం కూడా ఉండదని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఇవీ చూడండి: పెళ్లి కావాలా..! ఆగస్టు వరకూ ఆగాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.