గతంలో నిలిచిపోయిన పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని... కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయితీరాజ్ అధికారులను ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె... ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో కొవిడ్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్న ఎస్ఈసీ... పరిషత్ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
ఎన్నికలపై హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నందున... ఎన్నికల నిర్వహణపై కమిషనర్ సమాలోచనలు చేస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామని అధికారులకు చెప్పారు. ఎన్నికల పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం... తీర్పు రిజర్వు చేసింది. ఈనెల 3న తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై ఎస్ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన పంట- కేజీ రూ.లక్ష