ETV Bharat / state

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల - ap local bodies election schedule is released

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విడుదల చేశారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

andhra pradesh local bodies election schedule is released
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
author img

By

Published : Mar 7, 2020, 4:48 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తొలి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 9 నుంచి 11వరకు నామినేషన్లు స్వీకరించి.. 12న పరిశీలిస్తారు. మార్చి 14 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. 21న పోలింగ్ జరుగనుండగా.. 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 27న ఫలితాలు ఉంటాయి.

రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు...

ఏపీలోని ప్రతి జిల్లాలో 2 విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 17 నుంచి 19 వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 20న నామినేషన్ల పరిశీలన.. 22వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న తొలివిడత ఎన్నికల పోలింగ్ , అదే రోజు ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 29న రెండో విడత ఎన్నికలు, అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.