కేంద్ర కేబినెట్ పునర్విభజన వార్తల నేపథ్యంలో కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించటం సహా మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు(kambhampati hari babu)ను మిజోరం గవర్నర్‌గా నియమించారు. ఆయన విశాఖపట్నం(Visakhapatnam) లోక్‌సభ నుంచి.. 2014లో ఎంపీగా గెలుపొందారు. కంభంపాటి భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు.
హరిబాబు ప్రకాశం(prakasham) జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని(Visakhapatnam) ఆంధ్రా విశ్వవిద్యాలయంలో(andhra university) ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేశారు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి 1993వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు.
అభినందనలు..
మిజోరం గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. మిజోరం అభివృద్ధిలో హరిబాబు భాగస్వామి కావాలని వెంకయ్య నాయుడు ఆశించారు.
హరిబాబు మిజోరం గవర్నర్‌గా నియమితులవడం పట్ల ఏపీలోని భాజపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. హరిబాబుకు ఫోన్లు చేసి శుభాకాంక్షులు తెలుపుతున్నారు.
కొత్త గవర్నర్లు..
హరియాణా గవర్నర్ సత్యదేవ్ ఆర్యా.. త్రిపురకు బదిలీ కాగా ఆయన స్థానంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమితులయ్యారు. మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబును నియమించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. అక్కడ ఉన్న పీఎస్ శ్రీధరన్ పిళ్లై గోవాకు మార్చారు. త్రిపుర గవర్నర్ రమేష్ బియాస్‌ను ఝూర్ఖండ్‌కు బదిలీ చేశారు. కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లోత్, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగుభాయ్ ఛగన్‌భాయ్ పటేల్‌ను నియమించారు.
ఇదీ చదవండి: మిజోరాం గవర్నర్‌గా హరిబాబు- దత్తాత్రేయ బదిలీ