హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గ బీసీ నేతలు... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కలిశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరైనప్పటి నుంచి.. నేటి వరకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాల్లో బీసీలకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. అనేక నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత తగ్గిందని కృష్ణయ్యకు వినతి పత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్లోని నామినేటెడ్ పోస్టుల్లో బీసీలను మాత్రమే నియమించాలని కృష్ణయ్య... ఏపీ ముఖ్యమంత్రి జగన్కు విన్నవించారు. ఏపీలోని అనేక నియోజకవర్గాల్లో అగ్రకులాల పెత్తనం కొనసాగుతోందన్నారు.
ఇవీ చూడండి: బిహార్ పోరులో దళిత ఓటరు ఎటువైపు?